Share News

పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించండి

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:24 AM

స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల జిల్లా అబ్జర్వర్‌ వెంకటేశ్‌ తెలిపారు.

పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించండి
ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా అబ్జర్వర్‌

రామభద్రపురం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల జిల్లా అబ్జర్వర్‌ వెంకటేశ్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో చివరి రోజు నామినేషన్‌ పర్వాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎటువంటి తప్పులకు ఆస్కారం లేకుండా సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు. ఎన్ని నామినేషన్లు వచ్చాయి? ఎంత మంది సిబ్బందిని నియమించారన్న విషయంపై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఎల్‌.విష్ణును అడిగి తెలుసు కున్నారు. ఈ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలనిసూచించారు . అలాగే పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రత్నం, తహసీల్దార్‌ అజురఫీజాన్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2026 | 12:25 AM