టీడీపీ శ్రేణుల ఆందోళన
ABN , Publish Date - Nov 21 , 2026 | 12:08 AM
కురుపాం జడ్పీటీసీ సభ్యుడు వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్‌కు జడ్పీ చైర్మన్ పదవి దక్కకపోవడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పదవిని జనసేన అభ్యర్థికి కేటాయించడంతో శుక్రవారం ఉదయం కురుపాం కోట వద్ద ఆందోళనకు దిగారు.
- వీరేష్ చంద్రదేవ్‌కు జడ్పీ పీఠం దక్కకపోవడంపై నిరసన
- కోట ప్రధాన గేటుకు తాళం
- కారుకు అడ్డుగా నిలబడిన కార్యకర్తలు
-కంటతడి పెట్టి వారిని బతిమలాడిన వీరేష్
కురుపాం, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కురుపాం జడ్పీటీసీ సభ్యుడు వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్‌కు జడ్పీ చైర్మన్ పదవి దక్కకపోవడంపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పదవిని జనసేన అభ్యర్థికి కేటాయించడంతో శుక్రవారం ఉదయం కురుపాం కోట వద్ద ఆందోళనకు దిగారు. మెయిన్ రోడ్డులో షాపులు బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. రావాడ రోడ్డు కూడలి వద్ద మెయిన్ రోడ్డుపై వర్తకులు ఆందోళన చేశారు. వీరేష్ దేవ్‌కు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఇదే సమయంలో వైస్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసేందుకు కలెక్టరేట్‌కు వెళ్తున్న వీరేష్ చంద్రదేవ్‌ను అడ్డుకున్నారు. కోట ప్రధాన గేటుకు తాళం వేశారు. ఆయన కారుకు అడ్డుగా నిలబడి సుమారు అరగంట పాటు ఆందోళన చేపట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వీరేష్ దేవ్ కార్యకర్తలకు నచ్చజెప్పారు. అధిష్ఠానం ఆదేశాలను ఉల్లంఘించకూడదని, దయచేసి తనను వెళ్లనివ్వాలని కంటతడి పెట్టుకుంటూ వారిని బతిమిలాడారు. ఈ క్రమంలో కొందరు నాయకులు కల్పించుకుని గేటుకు వేసిన తాళాన్ని పగలగొట్టారు. అనంతరం ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ.. పార్టీ ఆదేశాలను అందరూ గౌరవించాలని కార్యకర్తలను నచ్చజెప్పి తన కారులో వీరేష్‌ను ఎక్కించుకుని, స్వయంగా డ్రైవ్ చేస్తూకలెక్టరేట్‌కు తీసుకెళ్లారు.
ఎమ్మెల్యే కారును చుట్టుముట్టిన వీరేష్ అభిమానులు
వీరేష్ చంద్రదేవ్‌కు కలిసి ఎన్నికలకు వెళ్లడానికి అక్కడకు వచ్చిన ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి కారును ఆయన అభిమానులు చుట్టుముట్టారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మహిళలు నినాదాలు చేశారు. అప్పటికే ఆయన పార్వతీపురం వెళ్లిపోవడంతో అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు వీరేష్ అభిమానులను వారించి ఎమ్మెల్యేను అక్కడ నుంచి పంపించారు.