Complete the Works గడువులోగా పనులు పూర్తి చేయండి
ABN , Publish Date - Sep 01 , 2026 | 11:58 PM
Complete the Works Within the Deadline గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో చేపడుతున్న ఇంజనీరింగ్, అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఐటీడీఏ పీవో ఆర్.వైశాలి ఆదేశించారు. మంగళవారం ఐటీడీఏ కార్యాలయంలో ఇంనీరింగ్ అధికారులతో సమీ క్షించారు.
పార్వతీపురం, సెప్టెంబరు 1(ఆంధ్రజ్యోతి): గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో చేపడుతున్న ఇంజనీరింగ్, అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఐటీడీఏ పీవో ఆర్.వైశాలి ఆదేశించారు. మంగళవారం ఐటీడీఏ కార్యాలయంలో ఇంనీరింగ్ అధికారులతో సమీ క్షించారు. పనుల పురోగతిపై ఆరా తీశారు. పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు నాణ్యత ప్రమాణాల్లో రాజీపడరాదని సూచించారు. పనులపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు. అనంతరం ఆమె పార్వతీపురం లోని జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్‌ను సందర్శించారు. ముడి జీడిపప్పు, సేకరణ నుంచి ప్రాసెసింగ్, గ్రేడింగ్, నాణ్యతా పరీక్షలు, ప్యాకింగ్, మార్కెటింగ్ వరకు జరుగుతున్న ప్రక్రియలను పరిశీలించారు. స్థానికంగా ముడి జీడిపప్పు సేకరించి విలువ జోడించడం ద్వారా రైతులు, గిరిజన ప్రాంతాల మహిళలు, యువతకు మెరుగైన ఆదాయం, ఉపాధి అవకాశాలు కల్పించొచ్చని వెల్లడించారు. నాణ్యత, పరిశుభ్రత, ఆహార భద్రత ప్రమాణాలు పాటిస్తూ ఆధునిక యంత్రాలతో ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచాలని అధికారులకు సూచించారు.