15లోగా పనులు పూర్తి చేయండి
ABN , Publish Date - Mar 07 , 2026 | 12:12 AM
మండలంలో అధివృద్ధి పనులను ఈ నెల 15వ తేదీలోపు పూర్తి చేయాలని డ్వామా పీడీ కె.రామచంద్రరావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.
సీతానగరం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): మండలంలో అధివృద్ధి పనులను ఈ నెల 15వ తేదీలోపు పూర్తి చేయాలని డ్వామా పీడీ కె.రామచంద్రరావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మండల అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పనులు పూర్తి చేయడ మే కాకుండా పూర్తయిన ప్రతి పనికి 15 లోపు బిల్లులు అప్‌లోడ్ పూర్తి చేయాలన్నారు. మండలంలో 184 సీసీ రోడ్లు, బీటీ రోడ్లు మంజూరు కాగా కేవలం 75 పనులు మాత్రమే వివిధ స్థాయిల్లో ఉన్నాయన్నారు. మిగిలిన వాటిని కూడా ప్రారంభించి పూర్తి చేయాలని ఆదేశించారు. అందుకు సంబంఽ దించిన ఎం.బుక్ రికార్డింగ్ రెడీ చేసి ఎంపీడీవోకు సమర్పించాలని ఆదేశించారు. సమావేశం లో ఏపీడీ శ్రీహరి, ఎంపీడీవో ఎంఎల్‌ఎన్ ప్రసాద్, మండల ఇంజనీరింగ్ అధికారి చంద్రమౌళి, ఏపీవో బాలకృష్ణ, జేఈ సోమేశ్వరరావు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.