స్వచ్ఛతతోనే సంపూర్ణ ఆరోగ్యం
ABN , Publish Date - Sep 18 , 2026 | 12:22 AM
పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుం దని కలెక్టర్ ఎస్.రామసుందరరెడ్డి అన్నారు.
కలెక్టర్ రామసుందర్ రెడ్డి
విజయనగరం టౌన్, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుం దని కలెక్టర్ ఎస్.రామసుందరరెడ్డి అన్నారు. నగరం లోని వసంతవిహార్ వద్ద ఆయన గురువారం స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా ఆయనే పిచ్చిమొక్కలను తొలగించి, చెత్తను ఎత్తి స్థానికులకు ఆదర్శంగా నిలిచారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 17 నుంచి అక్టోబరు 2 వరకూ జిల్లా వ్యాప్తంగా పెద్దఎత్తున స్వచ్ఛత హీ సేవా కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చా రు. స్థానికులు కూడా ఈ కార్యక్రమాల్లో మమేకం కా వాలని ఆయన కోరారు. నగర కార్పొరేషన్ కమిషనర్ బాలా స్వామి, ఇంజనీర్ ప్రసాద్, ప్రజారోగ్య శాఖాధికారి సాంబమూర్తి పాల్గొన్నారు
ఘన వ్యర్థాలకు చెక్ పెట్టాలి..
విజయనగరంలోని గంటస్తంభం నుంచి పెద్ద చెరువులోకి కాలువల నుంచి వస్తున్న మురికిలో ఘన వ్యర్థ పదార్థాలకు చెక్ పెట్టేలా ఆలోచన చేయాలని కలెక్టర్ రామసుందరరెడ్డి సూచించారు. నగరంలోని గంటస్తంభం రోడ్డులో ఉన్న ప్రధాన కాలువను ఆయన గురువారం పరిశీలించారు. ఈ పరిశీలనలో కార్పొరేషన్ విభా గం అధికారులు పాల్గొన్నారు.