అదనపు కట్నం కోసం వేధింపులపై ఫిర్యాదు
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:21 AM
అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని దల్లిపేట గ్రామానికి చెందిన దల్లి చిట్టితల్లి అనే మహిళ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ దుర్గా ప్రసాదరావు శనివారం తెలిపారు.
భోగాపురం, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని దల్లిపేట గ్రామానికి చెందిన దల్లి చిట్టితల్లి అనే మహిళ చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ దుర్గా ప్రసాదరావు శనివారం తెలిపారు. దల్లిపేట కు చెందిన చిట్టితల్లికి, రామచంద్రరెడ్డితో పదహారేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. భర్త నిరంతరం మద్యం తాగుతూ తిట్టడం, కొట్టడం చేస్తున్నాడని, అలాగే భర్తతో కలిసి అత్త, ఆడపడుచులు అదనపు కట్నం కోసం మానసికంగా వేధిస్తున్నారన్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు నిమిత్తం ఎస్‌ఐ రామారావుకు కేసు అప్పగించామని సీఐ తెలిపారు.