Share News

మోసంపై ఫిర్యాదు

ABN , Publish Date - Apr 03 , 2026 | 12:22 AM

ఓ యాప్‌లో పల్సర్‌ బైక్‌ను చూసి.. సంబంధిత నెంబర్‌కు రూ.75వేలు ఆన్‌లైన్‌లో సెండ్‌ చేసి, మోసపోయానని గరు గుబిల్లి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన ఉండేటి సాయిరాం అనే వ్యక్తి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మోసంపై ఫిర్యాదు

విజయనగరం కైం, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): ఓ యాప్‌లో పల్సర్‌ బైక్‌ను చూసి.. సంబంధిత నెంబర్‌కు రూ.75వేలు ఆన్‌లైన్‌లో సెండ్‌ చేసి, మోసపోయానని గరు గుబిల్లి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన ఉండేటి సాయిరాం అనే వ్యక్తి ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. సాయిరాం ఓ యాప్‌లో పల్సర్‌ బైక్‌ను చూసి, నచ్చడంతో.. అందులో పేర్కొన్న ఖాతాకు రూ.75 వేల ఆన్‌లైన్‌లో జమ చేశారు. అనంతరం బుధవారం బైక్‌ కోసం అడ్రసులో ఉన్న పేరు గల వ్యక్తిని కలిశారు. అయితే యాప్‌లో పెట్టిన బైక్‌ తనదే నని, అందులో ఇచ్చిన నెంబరు మాత్రం తనది కాదని సదరు వ్యక్తి తేల్చి చెప్పా డు. దీంతో మోసపోయానని గ్రహించిన సాయిరాం.. ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ చక్రవర్తిచౌదరి తెలిపారు.

Updated Date - Apr 03 , 2026 | 12:22 AM