DWMA PD డ్వామా పీడీపై ఫిర్యాదు
ABN , Publish Date - Jun 20 , 2026 | 12:18 AM
Complaint Against DWMA PD తమ పట్ల డ్వామా పీడీ రామచంద్రరావు దురుసుగా ప్రవర్తిస్తున్నారని శుక్రవారం సాయంత్రం పలువురు ‘ఉపాధి’ ఏపీవోలు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు.
పార్వతీపురం, జూన్ 19(ఆంధ్రజ్యోతి): తమ పట్ల డ్వామా పీడీ రామచంద్రరావు దురుసుగా ప్రవర్తిస్తున్నారని శుక్రవారం సాయంత్రం పలువురు ‘ఉపాధి’ ఏపీవోలు, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. బలిజిపేట, సాలూరు, వీరఘట్టం, భామిని తదితర మండలాల్లో తామంతా పనిచేస్తున్నట్లు తెలిపారు. పీడీ వైఖరి మార్చుకోవాలని, లేకుంటే తాము విధులు నిర్వహించబోమని ఏపీవో కేశవ తదితరులు చెప్పారు. దీనిపై డ్వామా పీడీ రామచంద్రరావుని వివరణ కోరగా.. సక్రమంగా పనులు చేయాలని ఆదేశిస్తే.. తనపై తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని తెలిపారు.