Share News

ఎకరాకు రెండు కోట్లు పరిహారం ఇవ్వాలి

ABN , Publish Date - Jun 24 , 2026 | 11:45 PM

పోలిపల్లి రెవెన్యూ పరిధిలో గూగుల్‌ సెం టర్‌కు స్వాధీనం చేసుకోబోయే డిపట్టా భూముల్లో ఎకరాకు రూ.రెండు కోట్లు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరారు.

  ఎకరాకు రెండు కోట్లు పరిహారం ఇవ్వాలి
భోగాపురంలో నిరసన తెలుపుతున్న రైతులు

భోగాపురం, జూన్‌24(ఆంధ్రజ్యోతి): పోలిపల్లి రెవెన్యూ పరిధిలో గూగుల్‌ సెం టర్‌కు స్వాధీనం చేసుకోబోయే డిపట్టా భూముల్లో ఎకరాకు రూ.రెండు కోట్లు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరారు. ఈ మేరకు బుధవారం భోగాపురంలో తహసీల్దార్‌ కార్యాలయం వద్ద నిరసన తెలి పారు. డిమాండ్లు పరిష్కరించే వరకూ భూములు ఇవ్వబోమని రైతులు నిరసన స్పష్టంచేశారు. అనంతరం తహసీల్దార్‌ హేమంత్‌కుమార్‌కు వినతిపత్రం అంద జేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 30 ఏళ్లు ఈ భూముల్లో జీవనోపాధి పొందుతున్నామని, గూగుల్‌ డేటా సెంటర్‌కు డిపట్టా భూములు స్వాధీనం చేసు కొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు భూములు స్వాధీన పక్రియ నిలిపివేయాలని కోరారు. కాగా రైతుకు న్యాయం జరిగేలా చర్యలుతీసుకుంటామని తహసీల్దార్‌ జి.హేమంత్‌ కుమార్‌ తెలిపారు. కార్యక్రమంలో పోలిపల్లి సూరమ్మ, పోలిపల్లి జయలక్ష్మి, పినిపిల్లి అచ్చి య్యమ్మ, అలమండ జయలక్ష్మితో పాటు 50 మంది రైతులు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2026 | 11:45 PM