పంటలకు పరిహారం చెల్లించాలి
ABN , Publish Date - Aug 28 , 2026 | 12:00 AM
గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల ను పరిష్కరించాలని, నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని టీడీపీ నాయ కులు, మాజీ సర్పంచ్ కలిపిండి సోమినాయుడు డిమాండ్ చేశారు. గు
కొమరాడ, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల ను పరిష్కరించాలని, నష్టపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని టీడీపీ నాయ కులు, మాజీ సర్పంచ్ కలిపిండి సోమినాయుడు డిమాండ్ చేశారు. గురువారం మం డలంలోని కల్లికోట గ్రామ సచివాలయానికి తాళం వేసి సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పరిసర ప్రాంతాల్లో నాగావళి నది ఉధృత్తంగా ప్రవహించడం వల్ల పంట పొలాలన్నీ నీటమునిగి నాశన మైనా అధికారులు పరిశీలనకు రాలేదన్నారు. గ్రామంలో గతంలో జరిగిన రీసర్వే రికార్డులు మార్పుల్లో తప్పిదాలు జరగడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరకట్ట నిర్మించకపోవడంతో పంటలన్నీ మునిగిపోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతు న్నామన్నారు. నిరసన తెలియజేస్తున్న విషయం తెలుసుకున్న ఎంపీడీవో ఎస్.రమేష్, తహసీల్దార్ చిన్నారావు, ఏవో ప్రసాద్ వచ్చి ఆయనతో మాట్లాడారు. సమస్యలన్నీ ప్రభు త్వం దృష్టిలో ఉన్నాయని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు తెలిపారు. అనంతరం సచివాలయం తాళం తీసి కార్యాలయంలో ఆయనతోపాటు రైతులతో సమావేశం ఏర్పాటుచేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే ప్రజా ప్రతినిధులతో ఫోన్‌లో సం ప్రదించి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని కోరారు.