అమ్మను చూద్దామని వస్తూ..
ABN , Publish Date - May 08 , 2026 | 12:32 AM
అమ్మను చూసేందుకు వస్తూ మండలంలోని రావుపల్లి గ్రామానికి చెందిన పల్ల అప్పలనాయుడు (25) రైలు నుంచి జారిపడి బుధవారం దుర్మరణం చెందాడు.
రైలు నుంచి జారిపడి యువకుడి మృతి
గరుగుబిల్లి, మే 7 (ఆంధ్రజ్యోతి): అమ్మను చూసేందుకు వస్తూ మండలంలోని రావుపల్లి గ్రామానికి చెందిన పల్ల అప్పలనాయుడు (25) రైలు నుంచి జారిపడి బుధవారం దుర్మరణం చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. విశాఖపట్నంలో వెల్డర్‌గా అప్పలనాయుడు పనిచేస్తున్నాడు. అమ్మను చూసేందు కు బుధవారం విశాఖపట్నం నుంచి భవానీపట్నం రైలులో వస్తున్న నేపథ్యంలో మానాపురం - గజపతినగరం మధ్య ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృ తిచెందాడు. అప్పలనాయుడు మృతితో రావుపల్లి గ్రామంలో విషాదఛాయలు అల ముకున్నాయి. కొన్నేళ్ల కింద అప్పలనాయుడు తండ్రి పరిసినాయుడు మృతి చెం దగా, ప్రస్తుతం తల్లి సావిత్రమ్మకు అతడే ఆదరువు. కుమారుడి మృతిపై తల్లి కన్నీరుమున్నీరైంది. ఆయన మృతదేహం గురువారం స్వగ్రామానికి చేరింది.