ఎయిర్‌పోర్టు ప్రారంభానికి తరలిరండి
ABN , Publish Date - Jul 27 , 2026 | 12:37 AM
ఆగస్టు ఒకటో తేదీన భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం పురస్కరించుకొని సభకు తరలిరావాలని శృంగవరపుకోట కోళ్ల ఎమ్మెల్యే లలితకుమారి కోరారు.
శృంగవరపుకోట/లక్కవరపుకోట, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఆగస్టు ఒకటో తేదీన భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం పురస్కరించుకొని సభకు తరలిరావాలని శృంగవరపుకోట కోళ్ల ఎమ్మెల్యే లలితకుమారి కోరారు. ఆదివారం లక్కవరపుకోట క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ జనసమీకరణ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న కొవ్యూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు సమక్షంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. నియోజక వర్గంలోని ప్రతి గ్రామం నుంచి కూటమి పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వచ్చేలా తీసుకుంటున్న చర్యలను టీడీపీ నాయకుడు కోళ్ల బాలాజీ అప్పల రామప్రసాద్ వివరించారు. సభకు తరలివచ్చే ప్రతిఒక్కరికి ఇబ్బందులు కలుగకుండ వాహనాలు, తాగునీరు, నాణ్యమై భోజనం ఏర్పాట్లుచేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. కార్యక్రమంలో ఎల్.కోట టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కరెండ్ల ఈశ్వరరావు, ఎస్.కోట పీఏసీఎస్ చైర్మన్ జీఎస్ నాయుడు పాల్గొన్నారు.