బైకు ఢీకొని..
ABN , Publish Date - Jan 17 , 2026 | 12:34 AM
పెనుబాక గ్రామం వద్ద శుక్రవా రం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తి తీ వ్రంగా గాయపడ్డాడు.
రాజాం రూరల్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): పెనుబాక గ్రామం వద్ద శుక్రవా రం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తి తీ వ్రంగా గాయపడ్డాడు. పెనుబాక గ్రామానికి చెందిన మూకళ్ల రాము(40) వ్యక్తిగత పనిమీద బొద్దాం వెళ్లి తిరిగి నడుచుకుంటూ ఇంటికి వస్తుండగా.. బొద్దాం నుంచి బైకుపై వస్తున్న శేఖర్ వెనుక నుంచి రామును ఢీకొట్టాడు. దీం తో రాము అక్కడికక్కడే మృతిచెందాడు. శేఖర్ పరిస్థితి విషమంగా ఉండడంతో రాజాం ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం తరలించారు. శ్రీకాకుళం జిల్లా దూసి గ్రామానికి చెందిన శేఖర్ రాజాం మండలం కొత్తవలస గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చి ప్రమాదాని కి గురయ్యాడు. రాజాం పొలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు రాముకు భార్య యశోద, ఇద్దరు పిల్లలు ఉన్నారు.