Share News

Collectorate 85 కలెక్టరేట్‌లో ఉద్యోగులు ఇక 85 మందే..

ABN , Publish Date - Jul 07 , 2026 | 12:07 AM

Collectorate Staff Strength Reduced to 85 కలెక్టరేట్లలో అధికారులు, సిబ్బంది సంఖ్య పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జీవో 402 ప్రకారం జిల్లా కలెక్టరేట్‌లో ఇకపై ఉద్యోగుల సంఖ్య 85కు పరిమితం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు కలెక్టర్‌ సహా అధికారులు మొదలు చివరి పోస్టు అయిన వాచ్‌మన్‌ వరకు 85 మందే ఉంటారు.

Collectorate   85 కలెక్టరేట్‌లో ఉద్యోగులు  ఇక 85 మందే..
కలెక్టర్‌ కార్యాలయం

  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

  • మన్యం కలెక్టరేట్‌లో ఉన్నది 46 మందే..

పార్వతీపురం, జూలై 6 (ఆంధ్రజ్యోతి): కలెక్టరేట్లలో అధికారులు, సిబ్బంది సంఖ్య పునర్వ్యవస్థీకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జీవో 402 ప్రకారం జిల్లా కలెక్టరేట్‌లో ఇకపై ఉద్యోగుల సంఖ్య 85కు పరిమితం చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు కలెక్టర్‌ సహా అధికారులు మొదలు చివరి పోస్టు అయిన వాచ్‌మన్‌ వరకు 85 మందే ఉంటారు. ఇందులో 53 పోస్టుల్లో రెగ్యులర్‌ అధికారులు కాగా, 32 పోస్టుల్లో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఉంటారు. గతంలో ఒక్కో జిల్లాలో 150 నుంచి 200 మంది సిబ్బంది ఉండే వారు. అయితే ఇటీవల కాలంలో జిల్లాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న అధికారులు, సిబ్బంది పోస్టులను సర్కారు పూర్తిగా పునర్వ్యవస్థీకరించింది. ఇక ఒకే విధమైన ఫార్మాట్‌లో అధికారులు, సిబ్బంది సంఖ్య ఉంటుందని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

జిల్లాలో పరిస్థితి ..

- జిల్లా కలెక్టరేట్‌లో ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అప్పట్లో కేవలం 78 మంది రెగ్యులర్‌ ఉద్యోగులను మాత్రమే అలాట్మెంట్‌ చేయగా.. నేడు 46 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌, డీఆర్వో, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ (కెఆర్‌ఆర్‌సీ) ఉండగా.. వివిధ హోదాలో ఏడుగురు తహసీల్దార్లకు ఐదుగురు మాత్రమే ఉన్నారు. సీనియర్‌ అసిస్టెంట్లు 17 మందికి 14 మంది, జూనియర్‌ అసిస్టెంట్లు 19 మందికి 9 మంది ఉన్నారు. డ్రైవర్లు ముగ్గురు ఉండాల్సి ఉండగా ఒక్కరు కూడా లేరు. ఆఫీస్‌ సబార్డినేట్లు 17 మంది ఉండాల్సి ఉండగా కేవలం ఎనిమిది మందే ఉన్నారు. ఒక్క వాచ్‌మన్‌ కూడా లేరు. ఇలా మొత్తంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో 39 ఖాళీలు ఉన్నాయి.

- ప్రభుత్వ తాజా నిబంధనల ప్రకారం కలెక్టర్‌తో పాటు డీఆర్వో, డిప్యూటీ కలెక్టర్‌ పరిపాల నాధికారులుగా ఉంటారు. కార్యాలయ సూపరింటెంట్లుగా నలుగురు తహసీల్దార్లు ఉంటారు. 16 మంది డిప్యూటీ తహసీల్దార్లు , సీనియర్‌ అసిస్టెంట్లు 16 మంది, జూనియర్‌ అసిస్టెంట్లు పది మంది, రికార్డు అసిస్టెంట్‌, జమేఽధార్‌ ఒకరు ఉంటారు. ఇక ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిప కన పది మంది కంప్యూటర్‌ ఆపరేటర్లు, నలుగురు డ్రైవర్లు, 16 మంది ఆఫీస్‌ సబార్డినేటర్లు, ఇద్దరు వాచ్‌మన్‌లు ఉంటారు.

రద్దు చేసిన పోస్టులివీ..

సీనియర్‌ అసిస్టెంట్లు 21 , స్టేనో 3, జూనియర్‌ అసిస్టెంట్లు 29, టైపిస్ట్‌లు 12, రికార్డు అసిస్టెంట్‌ , రోమియో ఆపరేటర్‌, సార్ఫ్‌, ఇద్దరు డ్రైవర్లు , ఆఫీస్‌ సబార్డినేట్లు 22 , ఒక స్కావెంజర్‌, ఇద్దరు స్వీపర్లు .. ఇలా 95 పోస్టులను రద్దు చేస్త్రూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - Jul 07 , 2026 | 12:07 AM