Collector మానవత్వం చాటుకున్న కలెక్టర్
ABN , Publish Date - Apr 12 , 2026 | 11:45 PM
Collector Who Showed Humanity రహదారిపై పడి ఉన్న క్షత గాత్రుడిని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తన వాహనంలో ఆసుపత్రికి తరలించి.. మానవత్వం చాటుకు న్నారు.
పార్వతీపురం/సీతానగరం/బెలగాం, ఏప్రిల్12(ఆంధ్రజ్యోతి): రహదారిపై పడి ఉన్న క్షత గాత్రుడిని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తన వాహనంలో ఆసుపత్రికి తరలించి.. మానవత్వం చాటుకు న్నారు. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం కృష్ణాపురానికి చెందిన శ్రీనివాసరావు ఆదివారం మధ్యాహ్నం తన ద్విచక్ర వాహనంపై సీతానగరం నుంచి స్వగ్రామానికి బయల్దేరాడు. అయితే మర్గ మధ్యలో చినభోగిల వద్ద ఎండ తీవ్రతకు వాహనంపై నుంచి పడి గాయపడ్డాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి రోడ్డుపై అచేతనంగా పడి ఉన్న క్షతగాత్రుడిని చూసి తన వాహనాన్ని ఆపారు. శ్రీనివాసరావు వద్దకు చేరుకుని పరిస్థితిని గమనించి.. తన వాహనంలో ఎక్కించుకుని సీతానగరం ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్టాఫ్ నర్స్ శ్రీదేవి ప్రాథమిక చికిత్స అనంతరం నేరుగా పార్వతీపురం జిల్లాకేంద్రాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు శ్రీనివాసరావుకు వైద్య సేవలు అందించి ప్రాణాపాయం నుంచి గట్టెక్కించారు. క్షతగాత్రునికి తలకు గాయమైందని, చికిత్స అందించామని జిల్లాకేంద్రాసుపత్రి వైద్యులు తెలిపారు. సేవాభావంతో పాటు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న కలెక్టర్‌ను ఏపీ ఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు కిషోర్ తదితరులు అభినందించారు.