Share News

అనాథ బాలుడి ఆరోగ్యంపై కలెక్టర్‌ ఆరా

ABN , Publish Date - Jan 26 , 2026 | 11:58 PM

స్థానిక శిశు గృహంలో డయేరియా తో మూడు రోజులుగా బాధపడుతున్న ఆనా థ బాలుడు దేవాన్ష్‌ ఆరోగ్యంపై కలెక్టర్‌ రామ సుందర్‌రెడ్డి ఆరా తీశారు.

అనాథ బాలుడి ఆరోగ్యంపై కలెక్టర్‌ ఆరా

విజయనగరం కలెక్టరేట్‌, జనవరి 26(ఆం ధ్రజ్యోతి): స్థానిక శిశు గృహంలో డయేరియా తో మూడు రోజులుగా బాధపడుతున్న ఆనా థ బాలుడు దేవాన్ష్‌ ఆరోగ్యంపై కలెక్టర్‌ రామ సుందర్‌రెడ్డి ఆరా తీశారు. స్థానిక శిశుగృహాన్ని కలెక్టర్‌ దంపతులు సోమవారం సందర్శించా రు. నాణ్యమైన మందులు వినియోగించి బాలుడి ఆరోగ్యాన్ని శ్రద్ధగా చూడాలని అక్కడి సిబ్బందికి ఆదేశించారు. బాలుడికి డయేరి యా అని తెలుసుకున్న కలెక్టర్‌ విజయవాడ లో గత రెండు రోజులుగా ఉన్నప్పటికీ అక్కడ నుంచి బాలుని ఆరోగ్యంపై ఆరా తీశారు. భోగి పండుగ రోజున ఈ బాలునికి భోగిపళ్లు పోసి దేవాన్ష్‌గా నామకరణం చేసింది కూడా కలెక్టర్‌ కావడం విశేషం.

Updated Date - Jan 26 , 2026 | 11:58 PM