Joint Collector for Salur పార్వతీపురానికి కలెక్టర్.. సాలూరుకు జేసీ
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:14 AM
Collector for Parvathipuram… Joint Collector for Salur జిల్లాలో నగర పంచాయతీ, పురపాలక సంఘాల్లో పాలకవర్గాల పదవీకాలం మంగళవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కావల్సి ఉండగా.. వారి నియామకాల్లో స్వల్ప మార్పు జరిగింది.
పార్వతీపురం టౌన్/సాలూరు, మార్చి18(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నగర పంచాయతీ, పురపాలక సంఘాల్లో పాలకవర్గాల పదవీకాలం మంగళవారంతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే బుధవారం నుంచి ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభం కావల్సి ఉండగా.. వారి నియామకాల్లో స్వల్ప మార్పు జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పార్వతీపురం పురపాలక సంఘం ప్రత్యేకాధికారిగా తొలుత నియామకమైన జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్‌రెడ్డిని సాలూరు మున్సిపాల్టీకి కేటాయించారు. ఈ పురపాలక సంఘానికి పార్వతీపురం సబ్ కలెక్టర్ వైశాలి ప్రత్యేకాధికారిగా నియమిస్తూ గతంలో జారీ అయిన ఆదేశాలు రద్దయినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. ఇక పార్వతీపురం ప్రత్యేకాధికారిగా కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తరుల్విచ్చింది.