Share News

మెరిట్‌ విద్యార్థులతో సహఫంక్తి భోజనం

ABN , Publish Date - May 04 , 2026 | 12:20 AM

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ సంకల్పానికి గురువుల కృషి తోడవ్వ డంతో, ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు అన్నారు.

మెరిట్‌ విద్యార్థులతో సహఫంక్తి భోజనం

చీపురుపల్లి, మే 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ సంకల్పానికి గురువుల కృషి తోడవ్వ డంతో, ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు అన్నారు. చీపు రుపల్లి నియోజవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అధిక మార్కులు సాధించి న విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆయన చీపురుప ల్లిలోని తన నివాసంలో విందు ఏర్పాటుచేశారు. వారి తో సహఫంక్తి భోజనం చేశారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో రామ్‌మల్లిక్‌నాయుడు మాట్లాడుతూ నారా లోకేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా మంచి ఫలితా ల కోసం సంకల్పం తీసుకున్నారన్నారు. దానికి అనుగు ణంగా విద్యా రంగంలో మార్పులు చేశారన్నారు. మంత్రి సంకల్పానికి, ఉపాధ్యాయుల కృషి, విద్యార్థులు పట్టుదల, తల్లిదండ్రుల సహకారం తోడు కావడంతో, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పది ఫలితాల్లో రికా ర్డులు నెలకొల్పారన్నారు. అనంతరం, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను రామ్‌మల్లిక్‌ అభినందించారు.

Updated Date - May 04 , 2026 | 12:20 AM