రైతు సంక్షేమానికి కూటమి కృషి
ABN , Publish Date - Mar 26 , 2026 | 12:03 AM
రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ జగదీశ్వరి అన్నారు.
కొమరాడ, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ జగదీశ్వరి అన్నారు. బుధవారం పరశురాంపురంలో నిర్వహించిన రైతన్నా.. మీ కోసంలో ఆమె పాల్గొని మాట్లాడారు. రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే దిశగా రైతులను ఆర్థికంగా ఎదిగేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇంటింటికీ వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పరశురాంపురంలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో లేగదూడల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్ జగదీశ్వరి ప్రారంభించారు. ఉత్తమ లేగదూడల పాడి రైతులకు బహుమతులు అందజేశారు. సబ్సిడీపై దాణాను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్ కడ్రక కళావతి, మండల కన్వీనర్ శేఖర్ పాత్రుడు, ఏఎంసీ వైస్ చైర్మన్ గార గౌరీశంకర్, కూటమి నాయకులు డి.వెంకటనాయుడు, మధుసూదనరావు, శ్రీకర్, సురేష్, సంతోషికుమారి, పశుసంవర్ధకశాఖ జేడీ మన్మఽథరావు, పశువైద్యులు పాల్గొన్నారు. అయితే లేగదూడల ప్రదర్శన ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రారంభం కాకపోవడంతో రైతులుతా అవస్థలు పడ్డారు.