Share News

పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఆసరా

ABN , Publish Date - May 21 , 2026 | 12:00 AM

పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఆసరాగా ఉంటోం దని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. బుధవారం లక్కవరపుకోటలో తొమ్మిది మందికి రూ.6 లక్షల 62వేల, 750లు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు.

 పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఆసరా
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే లలితకుమారి:

లక్కవరపుకోట, మే 20(ఆంధ్రజ్యోతి): పేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఆసరాగా ఉంటోం దని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. బుధవారం లక్కవరపుకోటలో తొమ్మిది మందికి రూ.6 లక్షల 62వేల, 750లు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ఇతోదికంగా సహాయపడుతోందన్నారు. ఇప్పటివరకు రెండేళ్ల కాలవ్యవధిలో మూడున్నర కోట్ల రూపాయలు పేదలకు కూటమి ప్రభుత్వం అందజేసిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్కపైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు. కార్పొరేట్‌ స్థాయి వైద్యం అందుకోలేని పేదలకు సీఎం ఆర్‌ఎఫ్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్య నిర్వాహక మాజీ కార్యదర్శి కేబీఏ రాంప్రసాద్‌, పార్టీ మండలాధ్యక్షులు కరెడ్ల ఈశ్వర రావు, చొక్కాకుల మల్లునాయుడు, పీవీ రత్నాజీ, కోళ్ల శ్రీను పాల్గొన్నారు.

Updated Date - May 21 , 2026 | 12:00 AM