పేదలకు సీఎంఆర్‌ఎఫ్ ఆసరా
ABN , Publish Date - Mar 21 , 2026 | 12:15 AM
పేదలకు సీఎంఆర్‌ఎఫ్ ఆసరాగా నిలుస్తోందని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు.
వీరఘట్టం, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): పేదలకు సీఎంఆర్‌ఎఫ్ ఆసరాగా నిలుస్తోందని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు. శుక్రవారం వీరఘట్టంలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం సహాయనిధి చెక్కులను సీతంపేట మండలంలోని మర్రి మానుగూడ గ్రామానికి చెందిన ఊయక సూర్యారావుకు రూ. 62,038, వీరఘట్టం మండలం ఎం.రాజపురం గ్రామానికి చెందిన డర్రు అమూల్యకు రూ.17,141 చెక్కులను అందించారు. ఈ కార్య క్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.