Share News

పార్టీలకతీతంగా సీఎంఆర్‌ఎఫ్‌

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:36 AM

పార్టీలకతీతంగా అర్హతే ప్రాతిపదికన ముఖ్యమంత్రి సహాయనిఽధిని అందజేస్తున్నామని ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి అన్నారు.

పార్టీలకతీతంగా సీఎంఆర్‌ఎఫ్‌
చెక్కులు పంపిణీ చేస్తున్న ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి

గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్‌ 13 (ఆంధ్ర జ్యోతి): పార్టీలకతీతంగా అర్హతే ప్రాతిపదికన ముఖ్యమంత్రి సహాయనిఽధిని అందజేస్తున్నామని ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి అన్నారు. సోమవారం స్థానిక క్యాంప్‌ కార్యాలయంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులకు లబ్ధిదారులకు ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగదీశ్వరి మాట్లాడుతూ వైద్యపరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కురపాం మండలం బియ్యాలవలసకు చెందిన పాలక సుందరరావుకు రూ.30,786, కిచ్చాడ గ్రామానికి చెందిన పద్మనాథం సుస్మితకు రూ.23,400, కురుపాం గ్రామానికి చెందిన కర్రి సత్యంనాయుడుకు రూ.52,522 చెక్కులను ఆమె అందజేశారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కె.వి.కొండయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్‌ కోలా రంజిత్‌కుమార్‌, కురపాం పీఏసీఎస్‌ చైర్మన్‌ డొల్లు కిశోర్‌, రామకృష్ణ, శ్రీను, సుబ్బలక్ష్మి, రంగారావు, మాసయ్య పాల్గొన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 12:36 AM