Share News

సీఎంఆర్‌ఎఫ్‌ పేదల పాలిట వరం

ABN , Publish Date - Aug 27 , 2026 | 12:07 AM

సీఎంఆర్‌ఎఫ్‌ పేదలపాలిట వరమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు తెలిపారు.

సీఎంఆర్‌ఎఫ్‌ పేదల పాలిట వరం
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందజేస్తున్న రామ్‌మల్లిక్‌నాయుడు :

మెరకముడిదాం, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): సీఎంఆర్‌ఎఫ్‌ పేదలపాలిట వరమని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్‌మల్లిక్‌నాయుడు తెలిపారు. బుధవారం గర్భాం, బుధరాయవలస, చిన్నబంటుపల్లిలో తొమ్మిది మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామ్‌మల్లిక్‌నాయుడు మాట్లాడుతూ పేదల అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరంతరం పనిచేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు తాడ్డి సన్యాసినాయుడు, బైరిపురం ఏఎంసీ చైర్మన్‌ తాడ్డి చంద్రశేఖర్‌, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు ధనుంజయ, మాజీ ఎంపీపీ కోట్ల మోతీలాల్‌నాయుడు పాల్గొన్నారు.

Updated Date - Aug 27 , 2026 | 12:07 AM