పేదలకు సీఎంఆర్‌ఎఫ్ వరం
ABN , Publish Date - Jun 15 , 2026 | 12:06 AM
సీఎం సహాయ నిధి (సీఎంఆర్ ఎఫ్) ద్వారా ఆర్థిక ప్రయోజనం లభించడం నిరుపేదలకు వరంగా మారిందని విజ యనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చెప్పారు.
విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు
విజయనగరం రూరల్, జూన్ 14 ( ఆంధ్రజ్యోతి): సీఎం సహాయ నిధి (సీఎంఆర్ ఎఫ్) ద్వారా ఆర్థిక ప్రయోజనం లభించడం నిరుపేదలకు వరంగా మారిందని విజ యనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చెప్పారు. ఆదివారం విజయనగరంలోని పలు డివిజన్లు, మండలంలోని పలుగ్రామాల్లో రూ.ఐదు లక్షల విలువ గల చెక్కులను ఏడుగురికి అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు గంటా రవి, పీతల కోదం డరామ్, గంటా పోలినాయుడు, పాసి అప్పలనాయుడు, ప్రసాదుల ప్రసాద్, బొద్దల నర్సింగరావు, కోండ్రు శ్రీనివాసరావు, అనురాధబేగం, పత్తిగిల్లి సూర్యకుమారితోపాటు పలువురు పాల్గొన్నారు. కాగా విజయనగరంలోని 24వ డివిజన్ బూర్లెపేటకు చెందిన టీడీపీ కార్యకర్త ప్రసాద్‌నాయుడు ఇటీవల ప్రమాదవశాత్తు మృతిచెందడంతో బీమా రూ.ఐదు లక్షలు వారి ఖాతాలో జమైంది. ఈ నేపథ్యంలో అదితి గజపతిరాజు ఆదివా రం ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటుతో అభినందన
విజయనగరం నగర పరిధిలోని 44వ డివిజన్ అయ్యన్నపేటలో సరస్వతి దేవి ఆలయం ప్రాంతంలో రహదారులు, కాలువలతోపాటు, ట్రాన్స్‌ఫార్మర్‌ని ఏర్పాటు చేయడంతో స్థానికులు ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి అభినం దించారు. కార్యక్రమంలో టీడీపీ నగర పార్టీ నాయకులు గంటా రవి, పీతల కోదండ రామ్, పి.జోగేష్, మాతా బుజ్జి పాల్గొన్నారు.
క్రీడలు మానసిక వికాసానికి దోహదం
విజయనగరం టౌన్, జూన్ 14 ( ఆంధ్రజ్యోతి): క్రీడలు మానసిన వికాసానికి దోహదం చేస్తామని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చెప్పారు. ఆదివారం విజ్జీ స్టేడి యంలో ఐదో సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ విజేతలను ఆమె అభినందించారు. ప్రొత్సాహక బహుమతులు అందజేశారు. బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు అవనాపు విజయ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు ప్రసాదుల ప్రసాద్, గంటా రవి, పీతల కోదండరామ్ పాల్గొన్నారు.