పేదల్లో వెలుగులు నింపుతున్న సీఎంఆర్‌ఎఫ్
ABN , Publish Date - Oct 01 , 2026 | 12:25 AM
పేద ప్రజల ఆరోగ్యమే ప్రధాన అజెండాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, సీఎంఆర్‌ఎఫ్ పేదల బతుకుల్లో వెలుగులు నింపుతోందని ఎమ్మెల్యే లలితకుమారి తెలిపారు.
శృంగవరపుకోట ఎమ్మెల్యే లలితకుమారి
లక్కవరపుకోట, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): పేద ప్రజల ఆరోగ్యమే ప్రధాన అజెండాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, సీఎంఆర్‌ఎఫ్ పేదల బతుకుల్లో వెలుగులు నింపుతోందని ఎమ్మెల్యే లలితకుమారి తెలిపారు. బుధవారం లక్కవ రపుకోటలో 29 మందికి రూ.16.49 లక్షల విలువగల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు, ఎల్వోసీలను అందించారు. కార్యక్రమంలో జీఎస్ నాయుడు, జననేన నియోజకవర్గ సమన్వయకర్త ఒబ్బిన సత్యనారాయణ, మేలాస్త్రి అప్పారావు, మాజీ సర్పంచ్ భూపాల్ నాయుడు, యడ్ల పైడిరాజు, బంగారునాయుడు పాల్గొన్నారు.