Share News

‘పేదలకు అండగా సీఎం సహాయ నిధి’

ABN , Publish Date - May 16 , 2026 | 12:30 AM

నిరుపేదలకు అండగా సీఎం సహాయ నిధి ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌, కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డి అన్నారు.

‘పేదలకు అండగా సీఎం సహాయ నిధి’

రాజాం, మే 15(ఆంధ్రజ్యోతి): నిరుపేదలకు అండగా సీఎం సహాయ నిధి ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌, కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల కు చెందిన 18 మంది లబ్ధిదారులకు మంజూరైన ము ఖ్యమంత్రి సహాయ నిధి చెక్కలను శుక్రవారం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో వారు అందజేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు నంది సూర్యప్రకాష్‌రావు, గురవాన నారాయణరావు, దుప్పలపూడి శ్రీనివాసరావు తదితరు లు పాల్గొన్నారు.

వైద్య శిబిరాలను వినియోగించుకోవాలి

ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోవాలని కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డి కోరారు. శుక్రవారం స్థాని క మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో మున్సిపాలిటీ లో పనిచేస్తున్న అధికారులకు, సిబ్బంది, సచివాలయ ఉద్యోగులకు, పారిశుధ్య కార్మికులకు, రెవెన్యూ అధికా రులు, సిబ్బందికి ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2026 | 12:30 AM