CM Chandrababu's visit is confarmed సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు
ABN , Publish Date - Feb 24 , 2026 | 11:57 PM
CM Chandrababu's visit is confarmed ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 28న జిల్లాకు రానున్నారు. ఈమేరకు ఆయన పర్యటన షెడ్యూల్‌ను మంగళవారం అధికారులు ఖరారు చేశారు. ఆ రోజు ఉదయం 9.30 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, 11 గంటలకు చీపురుపల్లి మండలం రావివలస చేరుకుంటారు.
సీఎం చంద్రబాబు పర్యటన ఖరారు
విజయనగరం, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 28న జిల్లాకు రానున్నారు. ఈమేరకు ఆయన పర్యటన షెడ్యూల్‌ను మంగళవారం అధికారులు ఖరారు చేశారు. ఆ రోజు ఉదయం 9.30 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి, 11 గంటలకు చీపురుపల్లి మండలం రావివలస చేరుకుంటారు. 11.10 గంటలకు చంద్రబాబు అక్కడ నాయకులు, అధికారులను కలుస్తారు. అక్కడి నుంచి 11.20 గంటలకు ప్రజావేదిక అయిన రావివలస చేరుకుంటారు. 11.20 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ప్రజా వేదికలో పాల్గొని ప్రసంగిస్తారు. 1.30 గంటలకు రావివలస నుంచి పైలపేట గ్రామానికి వెళ్లి ఎన్టీర్ భ రోసా పెన్షన్‌లు పంపిణీ చేయనున్నారు. అక్కడ పెన్షన్ లబ్ధిదారులతో ముచ్చటిస్తారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 4 గంటల వరకూ పార్టీ నేతలతో సమావేశమౌతారు. అనంతరం హెలిపాడ్ వద్దకు వెళ్లి హెలికాప్టర్‌లో ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.