సీఎం చంద్రబాబు రైతుల పక్షపాతి
ABN , Publish Date - Jan 11 , 2026 | 12:01 AM
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. శనివారం మండలంలోని చలమవలసలో రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు.
పార్వతీపురం రూరల్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతుల పక్షపాతి అని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. శనివారం మండలంలోని చలమవలసలో రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గతంలో వైసీపీ ప్రభుత్వం కాలంలో రైతుల భూములు పాస్‌పుస్తకాలపై మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి బొమ్మ ఉండేదని, దీంతో తమ భూములపై ఆయన ఫోటో ఏమిటని రైతులు ఆందోళన చెందిన పరిస్థితి ఉండేదని తెలిపారు. హామీ మేరకు రాజముద్రలతో కలిగిన పాస్‌పుస్తకాలను పంపిణీ చేస్తున్నామన్నా రు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. చల మవలసకు సీసీ రహదారులతోపాటు అనేక అభివృద్ధి పనులు మంజూరుచేస్తానని తెలిపారు. కార్యక్రమంలో అరకు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలు తేజోవతి, తహసీల్దార్ సురేష్, కొప్పల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ గొట్టాపు వెంకటనాయుడు, టీడీపీ మండల అధ్యక్ష కార్యదర్శులు బోను దేవిచంద్రమౌళి, గురజాన చంద్రమౌళి, వంగపండు త్రినాఽథనా యుడు, జి.ఉదయ్‌కుమార్, రొంపిల్లి ప్రభాకర్, చంటి పాల్గొన్నారు.
ప్రతిఒక్కరికీ వైద్యసేవలు
పార్వతీపురం టౌన్, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): టీడీపీ ప్రభుత్వం హయాంలో ప్రతిఒక్కరికీ వైద్యసేవందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు.శనివారం మునిసి పాలిటీలోని ఎనిమిదో వార్డులోగల కొత్తవలసలో పట్టణ ఉప ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలోని బెలగాం, జగన్నాఽథపురంలో ఇప్పటికే పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయని, కొత్తవలసలో లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుండడంతో ప్రారంభించినట్లు తెలిపారు. ఆరోగ్య కేంద్రానికి తన నివాసాన్ని అందిం చిన ఎనిమిదో వార్డు కౌన్సిలర్ కోరాడ నారాయణరావును ఎమ్మెల్యేతో పాటు టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు తేజోవతి, డీఎంహెచ్‌వో భాస్క రరావు అభినందించారు.కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావతి, డీఐవో జగన్‌మోహన్, ఉప ఆరోగ్యకేంద్ర డాక్టర్ చందు పాల్గొన్నారు.