Share News

Cluster Special Officer ప్రతి 70 ఇళ్లకు క్లస్టర్‌ స్పెషల్‌ ఆఫీసర్‌

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:20 AM

Cluster Special Officer for Every 70 Households : ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికీ అందేలా చర్యలు చేపడుతున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు ప్రతి 70 ఇళ్లకు ఒక క్లస్టర్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమించినట్లు వెల్లడించారు.

Cluster Special Officer   ప్రతి 70 ఇళ్లకు క్లస్టర్‌ స్పెషల్‌ ఆఫీసర్‌

పార్వతీపురం, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికీ అందేలా చర్యలు చేపడుతున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ యశ్వంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు ప్రతి 70 ఇళ్లకు ఒక క్లస్టర్‌ స్పెషల్‌ ఆఫీసర్‌ను నియమించినట్లు వెల్లడించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో 10 నుంచి 20 వరకు క్లస్టర్లు ఉన్నాయని తెలిపారు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా.. లేదా అనేది స్పెషల్‌ ఆఫీసర్లు తెలుసుకోవాలని సూచించారు.

Updated Date - Jan 10 , 2026 | 12:21 AM