ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రత కార్యక్రమాలు
ABN , Publish Date - May 23 , 2026 | 11:45 PM
ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు.
బొబ్బిలి, మే 23 (ఆంధ్రజ్యోతి): ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన తెలిపారు. శుక్ర వారం బొబ్బిలి మునిసిపాలిటీ ఆధ్వ ర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పరిశుభ్రతే లక్ష్యం నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ క్లీన్‌స్వీప్ కార్యక్ర మాన్ని ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ పరిశుభ్రతే ధ్యే యంగా నాలుగువారాల కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. మొదటి వారం ప్రజలు రోడ్లు ఎక్కువగా సంచ రించే ప్రాంతాల్లో పరిశుభ్రత, రెండో వారంలో కాలువలు శుభ్రపరిచే కార్యక్రమం, మూడో వారం ఇళ్లు, వ్యాపార సంస్థల్లో చెత్తను వేరుచేసే ప్రక్రియపై అవగాహన, నాల్గో వారం పబ్లిక్ టాయిలెట్ల పరిశుభ్రత కార్యక్రమాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో, స్పెషల్ ఆఫీసర్ రామ్మోహనరావు, మునిసిపల్ కమిషనర్ రామలక్ష్మి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు గెంబలి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
బాడంగి స్వచ్ఛరథం ప్రారంభం
బాడంగి, మే 23(ఆంధ్రజ్యోతి): బాడంగిలో ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించేందుకు స్వచ్ఛరథం కార్యక్రమాన్ని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన శనివారం ప్రారంభించారు. కార్యక్రమంలో బాడంగి మండల టీడీపీ అధ్యక్షులు తెంటు రవిబాబు, వైస్ ఎంపీపీలు సింగిరెడ్డి భాస్కరరావు, పాలవలస గౌరు, ఎంపీటీసీ దేవరపల్లి శ్రీను, వీరసాగరం మాజీ సర్పంచ్ ఈశ్వరరావు, మాజీ సర్పంచ్ కంది రమేష్ పాల్గొన్నారు.
స్వచ్ఛరఽథాన్ని సద్వినియోగం చేసుకోండి: ఎంపీడీవో
బొబ్బిలి రూరల్, మే 23(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో సంచరిస్తున్న స్వచ్ఛరథాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో పి.రవికుమార్ పిలుపునిచ్చారు. మం డలంలోని దిబ్బగుడ్డివలసలో శనివారం స్వచ్ఛరఽథాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు పరిశుభ్రతపైౖ అవగాహన కల్పించారు.