లారీ పైనుంచి జారిపడి క్లీనర్ మృతి
ABN , Publish Date - Mar 01 , 2026 | 12:13 AM
లారీ పైనుంచి జారిపడి క్లీనర్ మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది.
గజపతినగరం, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): లారీ పైనుంచి జారిపడి క్లీనర్ మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గజపతినగరం మండలంలోని పాతబ గ్గాం గ్రామానికి చెందిన పల్లి ప్రసాద్(24) అనే వ్యక్తి గత ఐదేళ్ల గా లారీలో గుడివాడలో లారీ క్లీనర్‌గా విధులు నిర్వహిస్తు న్నాడు. ఇటీవల మండలంలోని మరుపల్లి గ్రామంలో జరిగే పోలమాంబ అమ్మ వారి పండుగకు ఇంటికి వచ్చాడు. శుక్రవారం రాత్రి సాలూ రు నుంచి గుడివాడ వెళ్తున్న లారీలో ప్రసాద్ బయలుదేరాడు. శనివారం వేకువజామున లారీ దేవరపల్లి ఎర్నగూడెం హైవే వద్దకు వచ్చేసరికి.. లారీ డోర్ ఊడిపోయింది. నిద్రమత్తులో ఉన్న ప్రసాద్ జారిపడి అక్కడికక్కడే మృతిచెందాడు. కొడుకు మరణవార్త విన్న తల్లిదండ్రులు రాము, దేముడమ్మ జీర్ణించుకోలేకపోతున్నారు. విషయం తెలిసిన వెంటనే మృతుడి కుటుంబ సభ్యులతో పాటు గ్రామపెద్దలు ఘటనా స్థలానికి వెళ్లారు. గుడివాడలో ఆసుపత్రిలో శవపంచనామ నిర్వహించి, మృత దేహాన్ని ఆదివారం స్వగ్రామానికి తీసుకు వస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.