Share News

స్వచ్ఛ పాలకొండ అందరి లక్ష్యం కావాలి

ABN , Publish Date - Feb 10 , 2026 | 11:42 PM

స్వచ్ఛ పాలకొండ లక్ష్యంగా అధికారులు, ప్రజల లక్ష్యం కావాలని సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ పవర్‌ జగన్నాథ్‌ అన్నారు.

స్వచ్ఛ పాలకొండ అందరి లక్ష్యం కావాలి
వార్డులో పర్యటిస్తున్న సబ్‌ కలెకర్‌ స్వప్నిల్‌ పవర్‌ జగన్నాథ్‌

పాలకొండ, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ పాలకొండ లక్ష్యంగా అధికారులు, ప్రజల లక్ష్యం కావాలని సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ పవర్‌ జగన్నాథ్‌ అన్నారు. మంగళవారం ఉదయం నగర పంచాయతీలో పలు వార్డుల్లో ఆయన పర్యటించారు. కాలువల్లో పేరుకుపోయిన చెత్త, కాలువుల్లో పూడిక తీయకపోవడం, రోడ్లుపైనే చెత్తపేరుకుపోవడం గమనించి అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నగర పంచాయతీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతో పాటు వీధుల శుభ్రత పాటించాలన్నారు. ఇందుకు ప్రజలు కూడా సహకరించాలన్నారు. తడి చెత్త, పొడి చెత్తను పారిశుధ్య కార్మికులకు అందించాలన్నారు. కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్‌ రత్నంరాజు, పారిశుధ్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 10 , 2026 | 11:42 PM