Share News

భూ వివాదంలో ఘర్షణ.. రైతు హత్య

ABN , Publish Date - Nov 21 , 2026 | 12:12 AM

వ్యవసాయ భూమి వివాదంలో ఓ రైతు దారుణంగా హత్యకు గురయ్యాడు.

భూ వివాదంలో ఘర్షణ.. రైతు హత్య

గంట్యాడ, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ భూమి వివాదంలో ఓ రైతు దారుణంగా హత్యకు గురయ్యాడు. మం డలంలోని లక్కిడాం గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై గంట్యాడ ఎస్‌ఐ కశిరెడ్డి లక్ష్మణరావు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్కిడాం రెవెన్యూ పరిధిలోని 32 సెంట్ల భూమిలో గ్రామానికి చెందిన గొల్లు సత్తిబాబు(58) వ్యవసాయం చేసు కుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఈ భూమి విషయంలో గత కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన కిలపర్తి రామకృష్ణ కుటుంబంతో వివాదం ఉంది. సత్తిబాబు ఎప్పటిలాగే శుక్రవారం మధ్యాహ్నం తన భార్యతో కలిసి వ్యవసాయ పనులు చేసుకోవడానికి తన పొలా నికి వెళ్లాడు. అదే సమయంలో కిలపర్తి రామకృష్ణ, తన భార్య కిలపర్తి గౌరిదేవి.. కొడవలి, పార తీసుకుని అక్కడికి వెళ్లారు. మీరు ఎందుకు ఇక్కడకి వచ్చారని సత్తిబాబు వారిని ప్రశ్నించాడు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈక్ర మంలో గౌరీదేవి.. సత్తిబాబు చేతులను గట్టిగా పట్టుకోగా, రామకృష్ణ పారతో సత్తిబాబును కాళ్ల మధ్య బలంగా కొట్టాడు. దీంతో సత్తిబాబు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే సత్తిబాబు భార్య సింహాచలం తన బంధువుల సాయంతో ఆయన్ని జిల్లా కేంద్ర సర్వజన ఆసుపత్రికి తరలించింది. అయితే అప్పటికే సత్తిబాబు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య సింహాచలం ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయనగరం రూరల్‌ సీఐ బి.లక్ష్మణరావు, ఎస్‌ఐ కె.లక్ష్మణరావు ఎఫ్‌ఎస్‌ఎల్‌ టీమ్‌తో కలిసి ఘటనా స్థలం వద్దకు వెళ్లి, పరిస్థితిని పరిశీలించారు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Nov 21 , 2026 | 12:12 AM