Share News

CKYC సీకేవైసీ వేగవంతం

ABN , Publish Date - Apr 26 , 2026 | 11:50 PM

CKYC Process Accelerated ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సీకేవైసీ (సెంట్రల్‌ నో యువర్‌ కస్టమర్‌) ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయాలని డీసీసీబీ చైర్మన్‌ కిమిడి నాగార్జున అన్నారు. ఆదివారం సాలూరు డీసీసీబీ బ్రాంచ్‌ను సందర్శించారు. అనంతరం బ్యాంకులో జరుగుతున్న సీకేవైసీ ప్రక్రియపై సమీక్షించారు.

CKYC  సీకేవైసీ వేగవంతం
సీఈకేవైసీ ప్రక్రియను పరిశీలిస్తున్న డీసీసీబీ చైర్మన్‌ నాగార్జున

సాలూరు, ఏప్రిల్‌26(ఆంధ్రజ్యోతి): ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సీకేవైసీ (సెంట్రల్‌ నో యువర్‌ కస్టమర్‌) ప్రక్రియను వేగవంతంగా పూర్తిచేయాలని డీసీసీబీ చైర్మన్‌ కిమిడి నాగార్జున అన్నారు. ఆదివారం సాలూరు డీసీసీబీ బ్రాంచ్‌ను సందర్శించారు. అనంతరం బ్యాంకులో జరుగుతున్న సీకేవైసీ ప్రక్రియపై సమీక్షించారు. ‘ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం.. ప్రతీ ఖాతాదారు తప్పనిసరిగా సీకేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంది. అయితే కొంతమంది ఖాతాదారులు ఇంకా ఈ ప్రక్రియలో వెనుకబడి ఉన్నారు. అందుకే శని, ఆదివారాలు సెలవు రోజుల్లో కూడా ప్రత్యే కంగా సేవలు అందిస్తున్నాం.’ అని నాగార్జున అన్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిం చాలని ఆయన సిబ్బందికి సూచించారు. ప్రతీ ఖాతాదారుని చేరుకునే విధంగా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని, రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని వేగవంతంగా సీకేవైసీ పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో సీకేవైసీ పూర్తి చేయని ఖాతాదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. వారి సందేహాలను నివృత్తి చేసి.. స్సేహపూర్వక సేవల ద్వారా బ్యాంకుపై నమ్మకాన్ని పెంపొందించాలన్నారు. ఆయన వెంట బ్యాంకు మేనేజర్‌, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Apr 26 , 2026 | 11:50 PM