Share News

City ‘Panchayat’ నగర ‘పంచాయితీ’

ABN , Publish Date - Oct 18 , 2026 | 12:07 AM

City ‘Panchayat’ నెల్లిమర్ల నగర పంచాయతీలో రాజకీయం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఏమి జరుగుతుందో? అనేది చర్చనీయాంశంగా మారింది. కూటమి భాగస్వామ్య పార్టీలు కలివిడిగా వున్నాయంటూనే విడివిడిగా రాజకీయాలు నెరుపుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రస్థాయిలో సీట్ల సర్దుబాటులో భాగంగా ఇక్కడ చైర్మన్‌ పదవిని బీజెపీకి కేటాయించిన నేపథ్యంలో మైపాడ ప్రసాద్‌ ఆ పార్టీ చైర్మన్‌ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు.

City ‘Panchayat’ నగర ‘పంచాయితీ’
నెల్లిమర్ల నగర పంచాయతీ కార్యాలయం

నగర ‘పంచాయితీ’

నెల్లిమర్ల నగర పంచాయతీపై సర్వత్రా ఉత్కంఠ

చైర్మన్‌ పదవి బీజేపీకి కేటాయింపు

టీడీపీ నేతలు తీవ్ర మనస్తాపం

టీడీపీ నాయకుడు లెంక చైర్మన్‌ పదవికి నామినేషన్‌

ఆయనతో పాటు 23 వార్డుల్లోనూ బరిలోకి నాయకులు

నెల్లిమర్ల, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): నెల్లిమర్ల నగర పంచాయతీలో రాజకీయం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఏమి జరుగుతుందో? అనేది చర్చనీయాంశంగా మారింది. కూటమి భాగస్వామ్య పార్టీలు కలివిడిగా వున్నాయంటూనే విడివిడిగా రాజకీయాలు నెరుపుతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రస్థాయిలో సీట్ల సర్దుబాటులో భాగంగా ఇక్కడ చైర్మన్‌ పదవిని బీజెపీకి కేటాయించిన నేపథ్యంలో మైపాడ ప్రసాద్‌ ఆ పార్టీ చైర్మన్‌ అభ్యర్థిగా తెరపైకి వచ్చారు. అయితే ఎప్పటి నుంచో ఈ పదవి కోసం ఆశలు పెట్టుకుని ఎదురుచూస్తున్న టీడీపీ నేత లెంక అప్పలనాయుడు చైర్మన్‌ స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో మనస్తాపం చెంది చైర్మన్‌ పదవికి నామినేషన్‌ వేశారు. ఆయనతో పాటు ఆయన వర్గీయులు 23 మంది వార్డు సభ్యులుగా కూడా నామినేషన్‌ దాఖలు చేయడం స్థానికంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ఈనేపథ్యంలో బీజెపీ, జనసేన, టీడీపీ పెద్దలు ఎవరికివారే సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏమి జరుగుతుందోనని మరింత ఆసక్తిగా అందరూ చూస్తున్నారు. ఈ మూడు పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే వార్డుల్లో నామినేషన్‌ వేస్తుండడం రసవత్తరంగా మారింది. బీజెపీ అభ్యర్థి మైపాడ ప్రసాద్‌కు మూడు పార్టీలు, మిగతా రెండుపార్టీలు సహకరిస్తాయా? సహకరించవా అనేది చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Oct 18 , 2026 | 12:07 AM