Share News

ఎస్సీ కమిషన్‌ ఎదుట చింతల బెలగాం పంచాయితీ

ABN , Publish Date - May 27 , 2026 | 12:01 AM

చింతల బెలగాం దళితుల అసైన్డ్‌ భూముల రికార్డుల ట్యాంపరింగ్‌ పంచాయితీ మంగళవారం ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ఎదుట విజయవాడలో జరిగింది.

ఎస్సీ కమిషన్‌ ఎదుట చింతల బెలగాం పంచాయితీ
ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ ఎదుట చింతల బెలగాం దళితులు

జియ్యమ్మవలస, మే 26 (ఆంధ్రజ్యోతి): చింతల బెలగాం దళితుల అసైన్డ్‌ భూముల రికార్డుల ట్యాంపరింగ్‌ పంచాయితీ మంగళవారం ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి ఎదుట విజయవాడలో జరిగింది. చింతల బెలగాం దళితులు ఆధారాలతో సహా తమకు జరిగిన అన్యాయాన్ని చైర్మన్‌కు వివరించారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఆయన.. తగు చర్యలు తీసుకోవాలని ఎస్పీ మాధవరెడ్డికి తెలి పారని బాధిత దళితులు తెలిపారు. అనంతరం తహసీల్దార్‌ ఎన్‌. అప్పారావు వివరణ చైర్మన్‌ కోరారు. సరైన సమాధానం రాకపోవడంతో పాలకొండ సబ్‌ కలెక్టర్‌ పరిపాలనాధికారిని వివరణ అడిగారు. ప్రధానంగా రికార్డులు ట్యాంపరింగ్‌ చేసిన వారిపై, తప్పుడు రికార్డులతో అనుభవిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధి కా రులను ఆదేశించారు. చర్యలు తీసుకోకుంటే చింతలబెలగాం తానే వ స్తానని హెచ్చరించారు. దళితుల కోసం న్యాయ పోరాటం చేస్తున్న తా మరకండి ప్రవీణ్‌కుమార్‌ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

Updated Date - May 27 , 2026 | 12:01 AM