రామభద్రపురంలో చిన్నమ్మతల్లి పండుగ
ABN , Publish Date - Feb 25 , 2026 | 12:22 AM
రామభద్రపురంలో చిన్నమ్మతల్లి పండుగ ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు చినమ్మతల్లి ఘటాలను పసుపు కుంకుమలతో పూజలుచేశారు.
రామభద్రపురం, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): రామభద్రపురంలో చిన్నమ్మతల్లి పండుగ ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు చినమ్మతల్లి ఘటాలను పసుపు కుంకుమలతో పూజలుచేశారు. చుట్టుపక్కల ప్రాంతాలతోపాటు సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. క్యూలైన్లు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. తొక్కిసలాట జరగకుండా పోలీ సులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, ఎస్‌ఐ వెలమల ప్రసాదరావు పాల్గొన్నారు.