బాలల రక్షణ అందరి బాధ్యత’
ABN , Publish Date - Nov 17 , 2026 | 12:25 AM
బాలల రక్షణ అందరి బాధ్యత అని న్యాయాధికారి ఎం.రోహిణిరావు అన్నారు.
‘బొబ్బిలి, నవంబరు 16 (ఆంధ్ర జ్యోతి): బాలల రక్షణ అందరి బాధ్యత అని న్యాయాధికారి ఎం.రోహిణిరావు అన్నారు. సోమవారం పట్టణంలోని సింహాలతోట సమీపంలోని బాలుర గురుకుల పాఠశాలలో సురక్షిత బచ్చన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె బాలల హక్కులు, బాలలపై జరిగే లైంగిక వేధింపుల నుంచి రక్షణ, గుడ్‌టచ్-బ్యాడ్ టచ్, బాలల భద్రత, వేధింపులు ఎదురైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫిర్యాదు చేసే విధానం తదితర అంశాలపె ఆమె అవగాహన కల్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చిన్నారికి సురక్షితమైన వాతావరణంలో పెరిగే హక్కు ఉందన్నారు. బాలలపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టడం లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు కార్యక్రమంలో ప్యానెల్ అడ్వకేట్ ప్రసన్నకుమార్, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.