బాల్య వివాహాలతో హక్కులకు భంగం
ABN , Publish Date - Nov 28 , 2026 | 12:31 AM
బాల్య వివాహాలను ప్రోత్స హించడమంటే బాలల హక్కులను హరించడమేనని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయాధికారి హేమస్రవంతి జానకీరామ్ అన్నారు.
బొబ్బిలి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలను ప్రోత్స హించడమంటే బాలల హక్కులను హరించడమేనని ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయాధికారి హేమస్రవంతి జానకీరామ్ అన్నారు. అంతర్జాతీయ బాల్య వివాహాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కోర్టు ప్రాంగణంలో మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం బాల్య వివాహాలు, బలవంతపు వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల మానసిక వికాసం, ఆరోగ్యం తదితర అంశాలపై తీవ్ర ప్రభావం చూపే ఈ తరహా చర్యలను ఎవరూ ప్రోత్సహించరాదన్నారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. బాల్యవివాహాలకు సంబంధించిన సమాచారాన్ని న్యాయసేవాధికార సంస్థ టోల్ ఫ్రీ నెంబరు 15100కు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయాధికారి ఎం.రోహిణీరావు, న్యాయవాదులు పాల్గొన్నారు.
‘