Share News

Child Marriages Must Be Eradicated బాల్య వివాహాలను నిర్మూలించాలి

ABN , Publish Date - May 26 , 2026 | 11:49 PM

Child Marriages Must Be Eradicated ఏజెన్సీ ప్రాంతాల్లో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ కోరారు.

Child Marriages Must Be Eradicated బాల్య వివాహాలను నిర్మూలించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌

సీతంపేట రూరల్‌, మే 26(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ ప్రాంతాల్లో బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతిఒక్కరూ సహకరించాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌స్వప్నిల్‌ జగన్నాథ్‌ కోరారు. మంగళవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమన్నారు. గ్రామాల్లో ఎక్కడ బాల్యవివాహాలు జరిగినా ఐటీడీఏ, ఐసీడీఎస్‌, పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. ఆడపిల్లలను చదివిస్తే వారి భవిష్యత్తు బావుంటుందని, ఆదిశగా తల్లిదండ్రులు ఆలోచించాలని కోరారు. బాలికలు కూడా ఉన్నత చదువుల వైపు దృష్టిసారిం చాలన్నారు. ఈ సమావేశంలో ఏపీవో జి.చిన్నబాబు, డిప్యూటీ ఈవో పి.నారాయడు, జీసీడీవో రాములమ్మ, హెచ్‌ఎంలు కోటిబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2026 | 11:49 PM