బాల్య వివాహాలు చేయిస్తే జైలుశిక్ష
ABN , Publish Date - Jan 30 , 2026 | 12:02 AM
బాల్య వివాహాలు చేసినా.. లేదా ప్రోత్సహించినా సం బంధిత వ్యక్తులకు రెండేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమా నా విధించనున్నట్లు కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపా రు.
కలెక్టర్ రామసుందర్ రెడ్డి
విజయనగరం కలెక్టరేట్, జనవరి 29(ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలు చేసినా.. లేదా ప్రోత్సహించినా సం బంధిత వ్యక్తులకు రెండేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమా నా విధించనున్నట్లు కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపా రు. జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో బాల్య వివాహాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రచార రథాన్ని ఆయన గురువారం సాయం త్రం ప్రారంభించారు. అనంతరం దీనికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. గ్రామాల్లో బాల్య వివా హాల వల్ల కలిగే అనర్ధాలపై ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ విమలరాణి, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి లక్ష్మి, బెజ్జిపురం యూత్ క్లబ్ పీడీ ప్రసాద్ రావు పాల్గొన్నారు.
ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలి
రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య అంశాలు, వివిధ అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సూచించారు. కలెక్టర్లతో గురువారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడా రు. ఈసందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రజా సంక్షేమ, ప్రభుత్వ సేవలపై ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులు అందించే సేవలు, దేవాలయాల్లో భక్తుల కు కల్పిస్తున్న సౌకర్యాలపై సీఎస్ చర్చించారు. రెవెన్యూ రికార్డుల సవరణ, ఎఫ్ లైన్ సర్వే, భూములు రీ సర్వే ప్రక్రియలను వేగవంతం చేయాలన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించి విత్తనాలు, యూరియా లభ్యత, నాణ్యతపై దృష్టి పెట్టాలని సూచించారు. పురపాలక ప్రాంతాల్లో రహదారులు, గుంతల పూడ్చివేత, తాగునీ టి సరఫరా, వీధి దీపాల నిర్వహణపై ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాల ఆధారంగా చర్యలు తీసుకోవాల ని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రామసుందర్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదే శాల మేరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ సేతు మాధవన్ తదితరులు పాల్గొన్నారు.