బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం
ABN , Publish Date - Jan 22 , 2026 | 12:11 AM
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని ఐసీడీఎస్ సిబ్బంది తెలిపారు. ఈమేరకు బుధవారం జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలతోపాటు పలుచోట్ల బాల్యవివాహ్ ముక్తాభారత్, వందరోజులు కార్యక్రమంలో భాగంగా ర్యాలీలు నిర్వహించడంతోపాటు స్థానికులకు అవగాహన కల్పించారు.
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరమని ఐసీడీఎస్ సిబ్బంది తెలిపారు. ఈమేరకు బుధవారం జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలతోపాటు పలుచోట్ల బాల్యవివాహ్ ముక్తాభారత్, వందరోజులు కార్యక్రమంలో భాగంగా ర్యాలీలు నిర్వహించడంతోపాటు స్థానికులకు అవగాహన కల్పించారు.
ఫవిజయనగరం టౌన్,జనవరి21(ఆంధ్రజ్యోతి) బాల్యవివాహాలను ప్రోత్సహించిన వారికి కూడా చట్టపరమైన చర్యలు తప్పవని ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు త్రినాథమ్మ, పైడితల్లి తెలిపారు. విజయనగరం ప్రాజెక్టు పరిధిలోని జొన్నగుడ్డి, కణపాక అంగన్‌వాడీ కేంద్రాల్లో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. అనంతరం జొన్నగుడ్డి అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు ఎస్‌ఓఎస్ ప్రాజెక్టు నుంచి ప్రీస్కూల్ మెటీరి యల్‌ను ప్రాజెక్టు మేనేజర్ దుర్గరాజు అందజేశారు.
ఫగుర్ల, జనవరి 21(ఆంధ్రజ్యోతి): బాల్య వివాహాలను నిర్మూలించా లని గరివిడి ఐసీడీఎస్ అధికారి ఆరుద్ర కోరారు. బుధవారం పెనుబర్తి, తాతవారికిట్టలి, చింతపల్లిపేట గ్రామాల్లో బాల్య వివాహాల వల్ల కలిగే అనర్ధాలను తెలియజేస్తూ విద్య ఆవశ్యకతను గురించి వివరించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ శకుంతలా పాల్గొన్నారు.
ఫలక్కవరపుకోట, జనవరి 21(ఆంధ్రజ్యోతి):ఎల్.కోట జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం ఐసీడీఎస్ సిబ్బంది ఏసీడీపీవో లక్మీబాయి ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. ఈ సంద ర్భంగా కిశోరబాలికలకు బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలు, దుష్ప్రబా వాలను వివరించారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్ భాగ్యలక్ష్మి, హైమా, పద్మ తదితరులు పాల్గొన్నారు.