Share News

Chief Minister's arrival today నేడు ముఖ్యమంత్రి రాక

ABN , Publish Date - Feb 28 , 2026 | 12:21 AM

Chief Minister's arrival today ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం చీపురుపల్లి రానున్నారు. ఆ నియోజకవర్గంలో నిర్వహించే హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌, ఎన్టీఆర్‌ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గోనున్నారు. అనంతరం అదే మండలంలోని రావివలసలో జరిగే ప్రజావేదికలో మాట్లాడతారు. పైలపేటలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు అందజేస్తారు.

Chief Minister's arrival today నేడు ముఖ్యమంత్రి రాక

నేడు ముఖ్యమంత్రి రాక

చీపురుపల్లి హెచ్‌పీవీ వాక్సినేషన్‌ను ప్రారంభించనున్న చంద్రబాబు

సిద్ధమైన ప్రజావేదిక

పైలపేటలో పింఛను పంపిణీ

కార్యకర్తల సమావేశానికీ ఏర్పాట్లు పూర్తి

విజయనగరం, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి):

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శనివారం చీపురుపల్లి రానున్నారు. ఆ నియోజకవర్గంలో నిర్వహించే హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌, ఎన్టీఆర్‌ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమంలో పాల్గోనున్నారు. అనంతరం అదే మండలంలోని రావివలసలో జరిగే ప్రజావేదికలో మాట్లాడతారు. పైలపేటలో ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లు అందజేస్తారు.

తొలుత పైలపేట వద్ద ఏర్పాటు చేసిన హెలిపాడ్‌ వద్దకు ఉదయం 11 గంటల సమయంలో సీఎం చంద్రబాబు చేరుకుంటారు. అనంతరం ప్రత్యేక వాహనంలో చీపురుపల్లి ఏరియా ఆసుపత్రికి చేరుకుం టారు. అక్కడ జరిగే హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ రాజస్థాన్‌లోని ఆజ్మీర్‌ నుంచి ప్రారంభిస్తారు. జాతీయ స్థాయిలో జరిగే ఈ వేక్సినేషన్‌ కార్యక్రమంలో చీపురుపల్లి నియోజకవర్గంలోని రావివలసలో సీఎం చంద్రబాబు వర్చువల్‌గా పాల్గొంటారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ బారిన పడకుండా 14 ఏళ్లు దాటిన బాలికల కోసం నిర్వహిస్తున్న హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో వ్యాక్సినేషన్‌ వేయించుకోవడానికి వచ్చే బాలికలతో సీఎం ముఖాముఖి నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వాక్సినేషన్‌ అందించనున్నారు. అనంతరం మఽధ్యాహ్నం 1 గంటకు పైలపేటలో పింఛను లబ్ధిదారుల్ని కలుస్తారు. భోజన విరామం తరువాత ప్రజావేదిక సభలో సీఎం ప్రసంగిస్తారు. 2.50 గంటలకు రావివలసలో ఎన్టీఆర్‌ భరోసా పింఛను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పేదలకు పింఛను పంపిణీ చేస్తారు. అనంతరం 3.15 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతారు. జిల్లా పర్యటన అనంతరం తిరిగి రాత్రి 7 గంటలకు అమరావతికి చేరుకుంటారు.

- సీఎం రాకకు ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా ఆయన వినియోగించే చాపర్‌(హెలికాప్టర్‌)తో శుక్రవారం ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. ప్రజావేదిక, కార్యకర్తల సమావేశం జరిగే ఏరియాలో చాపర్‌ చక్కర్లు కొట్టి రెండు సార్లు ల్యాండ్‌ అయ్యింది. సుమారు 1200 మంది పోలీసులు ఇప్పటికే తమకు కేటాయించిన ప్రదేశాల్లో విధుల్లో చేరారు. సీఎం ప్రోగ్రం సమన్వయర్త వెంకటేష్‌ సూచన మేరకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే కళావెంకటరావు సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు.

- ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌, హోం మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత, జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌లు రావివలస కార్యక్రమానికి హాజరు కానున్నారు.

--------------------

Updated Date - Feb 28 , 2026 | 12:21 AM