Share News

ఉల్లాసంగా...ఉత్సాహంగా

ABN , Publish Date - Jan 10 , 2026 | 12:21 AM

:శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర కళాశాలల క్రీడా సాంస్కృతిక, సాహిత్య పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా అథ్లెటిక్స్‌ విభాగంలో విజేతలుగా నిలిచిన విద్యా ర్థులకు శుక్రవారం బహుమతి ప్రదానం చేశారు.

 ఉల్లాసంగా...ఉత్సాహంగా
తిరుపతి సీవీఎస్‌సీ విద్యార్థుల మూకాభినయం

గరివిడి, జనవరి 9 (ఆంధ్రజ్యోతి):శ్రీవేంకటేశ్వర పశువైద్య విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర కళాశాలల క్రీడా సాంస్కృతిక, సాహిత్య పోటీలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా అథ్లెటిక్స్‌ విభాగంలో విజేతలుగా నిలిచిన విద్యా ర్థులకు శుక్రవారం బహుమతి ప్రదానం చేశారు. బాలుర విభాగం లో 1500 మీటర్ల పరుగులో గరివిడి పశువైద్య కళాశాల బంగారు పతకం సాధించగా... 5000 వేల మీటర్ల పరుగులో తిరుపతి పశువైద్య కళాశాల విజయం సాధించింది. లాంగ్‌జంప్‌లో డెయిరీ టెక్నాలజీ కళాశాల విద్యార్థులు బంగారు పతకం సాధించారు. బాలికల విభాగంలో 1500 మీటర్ల పరుగులో తిరుపతి పశువైద్య కళాశాల, 5000 మీటర్ల పరుగులో గరివిడి పశువైద్య కళాశాల బం గారు పతకాలను సొంతం చేసుకున్నాయి. లాంగ్‌ జంప్‌లో తిరుప తి కళాశాల.. షాట్‌ఫుట్‌లో ప్రొద్దుటూరు కళాశాల విజేతలుగా నిలి చాయి. బాల్‌ బ్యాడ్మింటన్‌ బాలికల విభాగంలో గరివిడి-గన్నవరం పశువైద్య కళాశాలల మధ్య జరిగిన పోటీల్లో గరివిడి పశువైద్య కళాశాల విజయం సాధించింది. బాలుర విభాగంలో తిరుపతి, గరివిడి పశువైద్య కళాశాలలు హోరాహోరీగా తలపడ్డాయి. తిరుపతి కళాశాల విజేతగా, గరివిడి కళాశాల రన్నరప్‌గా నిలిచింది. తెలుగు వ్యాసరచన, తెలుగు, ఇంగ్లీష్‌ డిబేట్‌ పోటీలలో అన్ని కళాశాల నుం చి విద్యార్థులు ఉత్సహంగా పాల్గొన్నారు. క్విజ్‌ పోటీలలో తిరుపతి కళాశాల విద్యార్థులు విజయం సాధించారు. లలిత కళల విభాగం లో రొంగలి, క్లేమోడలింగ్‌, కార్టూన్‌, కొలాజ్‌, ఆన్‌దస్పాట్‌ పెయింటిం గ్‌, పోస్టర్‌ మేకింగ్‌వంటి సాంస్కృతికపోటీల్లో విద్యార్థులు సృజనాత్మ కతను చాటుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమా ల్లో భాగంగా ఏక పాత్రాభినయం, లఘు నాటికలు, మూకాభినయం వంటి పోటీ లో విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కార్యక్రమంలో కళాశాల అధి పతి మక్కేన శ్రీను, బి.జయచంద్ర, వైఆర్‌ అంబేడ్కర్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 10 , 2026 | 12:21 AM