కొరాపుట్-విశాఖ రైలులో తనిఖీలు
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:13 AM
బొబ్బిలి రైల్వేస్టేషన్‌లో సోమవారం మధ్యాహ్నం డీఎస్పీ రాకోటి గోవిందరావు ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది తనిఖీలు నిర్వహించారు.
బొబ్బిలి, జూన్ 22(ఆంధ్రజ్యోతి): బొబ్బిలి రైల్వేస్టేషన్‌లో సోమవారం మధ్యాహ్నం డీఎస్పీ రాకోటి గోవిందరావు ఆధ్వర్యంలో పోలీసు అధికారులు, సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. కొరాపుట్ నుంచి విశాఖ వెళ్లే ప్యాసింజర్ రైలులో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల లగేజీలను పరిశీ లించారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్ తదితర మత్తుపదార్ధాలు రవాణా చేస్తున్నారేమోనన్న కోణంలో ఈ తనిఖీలు నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో బొబ్బిలి ఎస్‌హెచ్‌వో కింతలి నారాయణరావు, రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐలు జ్ఞాన ప్రసాద్, డాగ్ స్క్వాడ్, ఈగల్ టీమ్, జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్, సబ్‌డివిజన్ పోలీసులు ఉన్నారు.