Share News

Panchayat Special Officers పంచాయతీ ప్రత్యేకాధికారుల మార్పు

ABN , Publish Date - Apr 07 , 2026 | 11:45 PM

Change of Panchayat Special Officers జిల్లాలోని 451 పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమైన సంగతి తెలిసిందే. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లతో పాటు ఎంఈవో-1లు 40 మంది, ఎంఈవో-2లు 34 మందిని ప్రత్యేకాధికారులుగా నియమించారు. అయితే ఎంఈవోలను ఆ విధులు నుంచి తప్పించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

 Panchayat Special Officers  పంచాయతీ ప్రత్యేకాధికారుల మార్పు

గరుగుబిల్లి, ఏప్రిల్‌7(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 451 పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమైన సంగతి తెలిసిందే. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఉప తహసీల్దార్లతో పాటు ఎంఈవో-1లు 40 మంది, ఎంఈవో-2లు 34 మందిని ప్రత్యేకాధికారులుగా నియమించారు. అయితే ఎంఈవోలను ఆ విధులు నుంచి తప్పించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. వారి స్థానంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులనుప్రత్యేకాధికారులుగా నియమించాలని రాష్ట్ర పంచాయ తీరాజ్‌ శాఖ ఉత్తర్వులిచ్చింది. పంచాయతీల్లో చేపట్టే అభివృద్ధి పనులకు ఎంబుక్‌లతో పాటు చెక్‌ మెజర్‌మెంట్‌ చేయాల్సి ఉందన్న కారణంగా మొదట్లో ప్రత్యేకాధికారుల నియామకానికి ఇంజ నీరింగ్‌ అధికారులను దూరం పెట్టారు. ప్రస్తుతం ఎఈవోలను తప్పించడంతో వారికే బాధ్యతలు అప్పగించనున్నారు.మొత్తంగా ఒక అధికారికి ఐదు పంచాయతీలు వరకు బాధ్యతలను అప్పగించే పరిస్థితి ఉంది. దీనిపై డీపీవో కొండలరావును వివరణ కోరగా.. ‘ ఎంఈవోల స్థానంలో ఇంజనీరింగ్‌, ఇతర శాఖల వారిని పంచాయతీ ప్రత్యేకాధికారులుగా నియమిస్తున్నాం. కలెక్టర్‌ జారీ చేసిన ఆదేశాలను మార్పు చేస్తే సంబంధిత ఎంపీడీవోలపై క్రమ శిక్షణ చర్యలు తప్పవు.’ అని తెలిపారు.

Updated Date - Apr 07 , 2026 | 11:45 PM