Change Is Possible Through Science సైన్స్‌తో మార్పులు సాధ్యం
ABN , Publish Date - May 28 , 2026 | 12:30 AM
Change Is Possible Through Science సైన్స్‌తో సమాజంలో మార్పులు సాఽధ్యమని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం సైన్స్ ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
పార్వతీపురం, మే27(ఆంధ్రజ్యోతి): సైన్స్‌తో సమాజంలో మార్పులు సాఽధ్యమని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం సైన్స్ ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు కేవలం తరగతి గదులకే పరిమితం కాకూడదన్నారు. సమాజంలో శాస్ర్తీయ దృక్పఽథాన్ని పెంపొందించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నేటి డిజటల్ యుగంలో అందుబాటులోకి వచ్చిన ఎన్నో సాంకేతిక వనరులను వినియోగించుకోవాలని సూచించారు. సామాజిక మాఽధ్యమాలు, డిజిటల్ స్ర్కీన్స్, 3డీ యూనిమేషన్స్ వంటి ఆధునిక సాధనాలతో విద్యార్థులకు సైన్స్ పాఠాలను మరింత సులభంగా, ఆసక్తికరంగా బోధించాలని తెలిపారు. మూఢనమ్మకాల నిర్మూలనలో కీలకపాత్ర పోషించా లన్నారు. ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూడకుండా ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా పాఠశాలల్లో కిచెన్ గార్డెన్స్, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. విద్యార్థుల్లో ప్రకృతిపై ప్రేమ, బాధ్యత పెంపొందించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఆయన వెంట డీఈవో బ్రహ్మాజీరావు తదితరులు ఉన్నారు.