‘కార్మికుల పక్షపాతి చంద్రబాబు’
ABN , Publish Date - May 02 , 2026 | 12:23 AM
కార్మికుల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.
పార్వతీపురం టౌన్, మే 1 (ఆంధ్ర జ్యోతి): కార్మికుల పక్షపాతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. శుక్రవారం మే డే సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో కార్మికులను కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేకాధికారి ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆయన సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వ అహర్నిశలు శ్రమిస్తోందన్నారు. అన్ని దేశాల్లో అమలు జరుగుతున్న కార్మిక చట్టాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో అమలు చేసేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ప్రధానంగా కార్మికుల ఆకలి తీర్చేందుకు అన్న క్యాంటీన్‌లను ఏర్పాటు చేశారన్నారు. మున్సిపాలిటీల్లో పనికి ప్రతి కార్మికుడికి పనికి తగ్గ వేతనం ప్రభుత్వం పెంచేందుకు శ్రీకారం చుట్టిందన్నారు.