Share News

చలో విజయవాడకు ఉద్యోగ సంఘాల పిలుపు

ABN , Publish Date - Aug 13 , 2026 | 11:52 PM

ఏపీ సీపీఎస్‌ఈఏ ఆధ్వర్యంలో సెప్టెంబరు 1న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

చలో విజయవాడకు ఉద్యోగ సంఘాల పిలుపు
పోస్టర్‌ను విడుదల చేస్తున్న నాయకులు

పార్వతీపురం, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ఏపీ సీపీఎస్‌ఈఏ ఆధ్వర్యంలో సెప్టెంబరు 1న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. గురువారం సాయత్రం స్థానిక ఎన్‌జీవో హోంలో ఉద్యోగ సంఘాల నాయకులు రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర సంఘం పిలుపు మేరకు భారీస్థాయిలో చలో విజయవాడను నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో జేఏసీ జిల్లా చైర్మన్‌, ఎన్‌జీవో జిల్లా అధ్యక్షుడు జి.వి.ఆర్‌.ఎస్‌.కిశోర్‌ మాట్లాడారు.

Updated Date - Aug 13 , 2026 | 11:52 PM