రెండు దశల్లో జనగణన
ABN , Publish Date - Mar 23 , 2026 | 11:56 PM
జనాభా లెక్కలు రెండు దశల్లో నిర్వహిస్తామని, మొద టి దశలో బ్లాకుల వారిగా గృహాల లెక్కింపు ఉంటుంద ని కలెక్టర్, జిల్లా గణాంక అధికారి రామసుందర్‌రెడ్డి తెలిపారు.
కలెక్టర్, జిల్లా ప్రధాన గణాంక అధికారి రామసుందర్‌రెడ్డి
విజయనగరం కలెక్టరేట్, మార్చి 23(ఆంధ్రజ్యోతి): జనాభా లెక్కలు రెండు దశల్లో నిర్వహిస్తామని, మొద టి దశలో బ్లాకుల వారిగా గృహాల లెక్కింపు ఉంటుంద ని కలెక్టర్, జిల్లా గణాంక అధికారి రామసుందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎన్నికల కం ట్రోల్ రూంలో జిల్లా ముఖ్య ప్రణాళికా అధికారి బాలా జీ ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయి శిక్షకులకు శిక్షణ తరగతు లు నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ గతంలో జనాభా లెక్కింపు మాన్యువల్‌గా జరిగే దని, ఈసారి అంతా ఎలకా్ట్రనిక్ విధానం లోనే జరుగుతుందన్నారు. తొలి దశలో గృహాల లెక్కింపు ఉంటుందని చెప్పారు. జనగణనకు సంబంధించి నిబంధనలు, పద్ధతులు పాటిస్తూ తప్పులు జరగకుం డా చూడాలన్నారు. తదుపరి ఎన్యుమ రేటర్లకు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఉంటుం దని తెలిపారు. అన్ని స్థాయిల్లో శిక్షణ సజావుగా జరగాలన్నారు. సీపీవో బాలాజీ మాట్లాడుతూ, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది ఎనిమిదవ జనాభా లెక్కింపు కార్యక్రమం అన్నారు. బ్రిటీష్ కాలంలో తొలుత 1881లో జరిగిందన్నారు. కరోనా కారణంగా జనగణన వాయిదా పడిందని, తాజాగా ప్రస్తు తం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ సమావే శంలో డీఆర్వో సత్తిబాబు, డిగ్రీ కళాశాల అధ్యా పకులు, టీవోటీ రాఘవస్వామి తదితరులు పాల్గొన్నారు.